ట్రేడ్ బజ్: నైజాంలో ‘పెద్ది’ డే 1 ఓపెనింగ్స్ ప్రిడిక్షన్ ఎంతంటే!

ట్రేడ్ బజ్: నైజాంలో ‘పెద్ది’ డే 1 ఓపెనింగ్స్ ప్రిడిక్షన్ ఎంతంటే!

Published on Jun 1, 2026 7:06 PM IST

Peddi

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా తెలుగు చిత్రమే “పెద్ది”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో మొదటి సారి చేసిన సినిమా ఇది కాగా సాలిడ్ ఎమోషన్స్, మంచి యాక్షన్ ఫీస్ట్ తో సినిమా ఉంటుంది అని మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. అయితే పెద్ది సినిమా ఓపెనింగ్స్ కి సంబంధించి ఆల్రెడీ రచ్చ షురూ అయ్యింది. మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ది బుకింగ్స్ ఊపు చూస్తుంటే గట్టి ఓపెనింగ్స్ దక్కేలానే కనిపిస్తున్నాయి.

ఏపీలో ఆల్రెడీ మొదలైన మేనియా..

నైజాం మార్కెట్ లో పర్మిషన్ రాక ముందే ఏపీలో పెద్ది సినిమాకి అన్ని క్లియర్ అయ్యాయి. అలా లిమిటెడ్ గా ఒకో ప్రాంతంలో సినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతూ వస్తున్న నేపథ్యంలో పెద్ది పైడ్ ప్రీమియర్స్ సహా డే 1 బుకింగ్స్ కూడా గట్టి మూమెంటం తోనే మొదలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే నైజాం మార్కెట్ లో కూడా పెద్ది రీసౌండ్ గట్టిగానే ఉంటుంది అని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

నైజాంలో డే 1 వసూళ్ల అంచనా

నైజాం మార్కెట్ లో పెద్ది సినిమాకి ఇంట్రెస్టింగ్ ట్రేడ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం పెద్ది సినిమాకి ఎంత బ్యాడ్ ఫేజ్ లో చూసుకున్నా డే 1 కి ఈజీగా 15 కోట్ల మేర ఓపెనింగ్స్ గ్రాస్ దక్కే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. ఇది సినిమా ప్రీమియర్స్ కూడా లేని పక్షంలో అట. ఒకవేళ ప్రీమియర్స్ ఉండి టికెట్ ధరల హైక్స్ కూడా వస్తే డబుల్ మార్జిన్ వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదని వినిపిస్తుంది.

సో ఇలా ప్రస్తుతం నైజాం మార్కెట్ కి సంబంధించి పెద్ది విషయంలో ట్రేడ్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు