ట్రిపుల్ సెంచరీ బాదేసిన ‘పెద్ది’.. బాక్సాఫీస్ దగ్గర నాటౌట్ రన్!

ట్రిపుల్ సెంచరీ బాదేసిన ‘పెద్ది’.. బాక్సాఫీస్ దగ్గర నాటౌట్ రన్!

Published on Jun 9, 2026 1:02 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “పెద్ది” ర్యాంపేజ్ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలుసిందే. గేమ్ ఛేంజర్ లాంటి భారీ వైఫల్యం తర్వాత వచ్చిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా భారీ ఓపెనింగ్స్ సాధించి దుమ్ము లేపింది. ఇలా వరల్డ్ వైడ్ గా సక్సెస్ ఫుల్ 5 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మొత్తం 5 రోజుల్లో ట్రిపుల్ సెంచరీ మార్క్ ని క్రాస్ చేసి సెన్సేషన్ ని సెట్ చేసింది.

మేకర్స్ ఈ చిత్రం మొత్తం 315 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అనుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమా ఆల్రెడీ రెండో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. లాంగ్ రన్ లో అయితే 400 కోట్ల మార్క్ ని దాటే సూచనలు ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల అయ్యింది.

తాజా వార్తలు