సెన్సేషన్.. అక్కడ 1 మిలియన్ కొట్టేసిన ‘పెద్ది’ గాడు

సెన్సేషన్.. అక్కడ 1 మిలియన్ కొట్టేసిన ‘పెద్ది’ గాడు

Published on Jun 3, 2026 7:05 AM IST

Peddii

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న స్ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కాబోతుండగా సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా సెన్సేషన్ సెట్ చేస్తుంది. ఆయితే ఈ సినిమా అక్కడ లేటెస్ట్ గా 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపింది.

RRR తర్వాత రామ్ చరణ్ కి ఇదే 1 మిలియన్ ప్రీమియర్ సినిమా అని చెప్పొచ్చు. రిలీజ్ కి ముందే అనుకున్నట్లుగా సినిమా 1 మిలియన్ మార్క్ దాటేసింది. రిలీజ్ రోజుకి 2 మిలియన్ కొడుతుందో లేదో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే జగపతిబాబు, బొమన్ ఇరానీ, శివ రాజ్ కుమార్ తదితరులు నటించారు. అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా జూన్ 4న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు