‘పెద్ది’తో మొదలైన జూన్ బ్లాస్ట్.. సామ్, అఖిల్ లకి కలిసొస్తుందా?

‘పెద్ది’తో మొదలైన జూన్ బ్లాస్ట్.. సామ్, అఖిల్ లకి కలిసొస్తుందా?

Published on Jun 6, 2026 10:31 PM IST

ram-charan

దాదాపు చాలా నెలల తర్వాతే తెలుగు సినిమా దగ్గర మళ్ళీ ఓ సాలిడ్ హిట్ సినిమా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి “పెద్ది” రూపంలో వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేసిన ఈ సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం జూన్ నెలలో మొదటి బిగ్ రిలీజ్ గా వచ్చి మళ్ళీ థియేటర్స్ కి జనాన్ని రప్పించిన సినిమాగా నిలిచింది. అంతే కాకుండా రామ్ చరణ్ కి సాలిడ్ కంబ్యాక్ గా కూడా నిలిచింది.

అయితే జూన్ నెలకి ఇది బాక్సాఫీస్ దగ్గర ఒక బ్లాస్టింగ్ ఆరంభం కాగా నెక్స్ట్ రానున్న సినిమాలకి కూడా ఇలానే కలిసొస్తుందో లేదో అనేది మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. భారీ ఎత్తున ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. ఇదే మూమెంటంని ఇతర సినిమాలు కూడా కొనసాగించాల్సి ఉంది.

వచ్చే వారం థియేటర్స్ లో లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ సినిమా విడుదల అవుతుంది. వైజయంతి బ్యానర్ కావడం పైగా ఏ క్లాస్ ఆడియెన్స్ లో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. ఇక వీటి తర్వాత స్టార్ బ్యూటీ సమంత టాలీవుడ్ కంబ్యాక్ సినిమా ‘మా ఇంటి బంగారం’తో రాబోతుంది. ట్రైలర్ తో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాకి కూడా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో తన కంబ్యాక్ కి కూడా ఈ జూన్ నెల రిలీజ్ ఎంతో కీలకం.

ఇక తన ఫ్రైడే తర్వాత అక్కినేని యంగ్ హీరో అఖిల్ నుంచి ‘లెనిన్’ రాబోతుంది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న సినిమా ఇది కాగా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ చూస్తున్నాడు. సో తాను కూడా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి జూన్ ని ఒక బ్యాంగర్ నెలగా నిలుపుతాడా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు