ఉత్తరాంధ్రలో ‘పెద్ది’ గాడి ఊచకోత.. ఓజి, పుష్ప 2 లు లేవ్ అంతా పెద్దినే

ఉత్తరాంధ్రలో ‘పెద్ది’ గాడి ఊచకోత.. ఓజి, పుష్ప 2 లు లేవ్ అంతా పెద్దినే

Published on Jun 6, 2026 4:00 PM IST

peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం భారీ లెవెల్లో విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. అయితే మన రెండు తెలుగు స్టేట్స్ లో సాలిడ్ హోల్డ్ తో పెద్ది సెన్సేషన్ ని సెట్ చేస్తుంది. మరీ ముఖ్యంలో ఏపీలో మాత్రం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో రామ్ చరణ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తున్నాడని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

ఉత్తరాంధ్రలో అయితే బాహుబలి 2, పుష్ప 2, ఇంకా ఓజి, దేవర లాంటి సినిమాలని మించి పెద్ది రెండో రోజున సెన్సేషనల్ పెర్ఫామెన్స్ ని చేసినట్టు తెలుస్తుంది. ఇలా రెండో రోజుకి 2 కోట్ల షేర్ కి పైగా ఒక్క ఉత్తరాంధ్ర నుంచే రాబట్టిన పలు బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల లిస్ట్ లో పెద్ది కూడా యాడ్ అయ్యింది. ఇక గోదావరి జిల్లాల్లో కూడా పెద్ది ఊహించని నంబర్స్ సెట్ చేస్తున్నట్టు సమాచారం. ఇలా మొత్తానికి మాత్రం రామ్ చరణ్ జాతర కొనసాగిస్తున్నాడు.

తాజా వార్తలు