మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో చేసిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే పెద్ది. భారీ అంచనాలతో బాక్సాఫీస్ కి కావాల్సిన హిట్ ని రామ్ చరణ్ పట్టుకొచ్చి మళ్లీ థియేటర్స్ వైపు జనం వెళ్లేలా చేసాడు. ఇలా ఫైనల్ గా పెద్ది నిన్న జూన్ 4న గ్రాండ్ గా విడుదల అయ్యింది. అయితే ఈ మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర, బుకింగ్స్ పరంగా సెన్సేషనల్ స్టార్ట్ ని ఈ సినిమా అందుకుంది.
బుక్ మై షోలో గత 24 గంటల్లో 6 లక్షల 50 వేలకి పైగా టికెట్లు సే సినిమాకి తెగాయి. అలానే నార్త్ అమెరికా మార్కెట్ లో సినిమా ఏకంగా 1.9 మిలియన్ మార్క్ వసూళ్లు దాటేసి 2 మిలియన్ కి చేరువలోకి వచ్చేసింది. దీనితో పెద్ది ర్యాంపేజ్ మాములు లెవెల్లో మొదలు కాలేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


