యూఎస్ మార్కెట్ లో సాలిడ్ మార్క్ అందుకున్న ‘పెద్ది’

యూఎస్ మార్కెట్ లో సాలిడ్ మార్క్ అందుకున్న ‘పెద్ది’

Published on May 13, 2026 9:00 AM IST

peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు యూఎస్ మార్కెట్ ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయగానే రికార్డు రెస్పాన్స్ అందించారు. అయితే తర్వాత ఇవి కొంచెం నెమ్మదించిన సంగతి తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా పెద్ది సాలిడ్ మరో మార్క్ ని క్రాస్ చేసినట్టు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. పెద్ది అక్కడ ఇప్పుడు 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని దాటి అదరగొట్టింది. ఇంకా ట్రైలర్, ఇతర కంటెంట్ ఏమి రాలేదు కాబట్టి ఇది నెంబర్ అనే చెప్పొచ్చు. ఇక కంటెంట్ వచ్చాక గ్రాఫ్ ఏ మేరకు పెరుగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే జగపతిబాబు, శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా జూన్ 4న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

తాజా వార్తలు