మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిన సాలిడ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. కుస్తీ, క్రికెట్ అలానే పరుగు పందెం నేపథ్యంలో బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో చేసిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది.
ఇలా వరల్డ్ వైడ్ మొత్తం 6 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ 6 రోజుల్లో భారీ నంబర్స్ సెట్ చేసినట్టు మేకర్స్ రివీల్ చేశారు. ఇప్పుడు వరకు పెద్ది 332.1 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా నిర్ధారణ చేశారు. సో పెద్ది స్ట్రాంగ్ రన్ అలా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇంకొన్ని రోజుల్లోనే కొత్త సీన్స్ ని కూడా యాడ్ చేసి పెట్టనున్నారనే టాక్ ఉంది.
సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అలానే టికెట్ ధరలు ఏపీలో కూడా తగ్గితే మరింత బూస్టప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించగా ఏ ఆర్ రెహమాన్ సాలిడ్ మ్యూజిక్ ఈ చిత్రానికి అందించారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.



