
కింగ్ నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొంటున్న తారలు తమకు వచ్చిన ప్రైజ్ మనీను స్వచ్చంద సంస్థలకు విరాళంగా ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం అదే సంప్రదాయాన్ని పాటించారు.
ప్రముఖ హీరోయిన్ సమంత ఆధ్వర్యంలో స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్, ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎపిసోడ్ పూర్తయ్యే సమయానికి రామ్ చరణ్ 3.20 లక్షల రూపాయలను గెలుచుకున్నారు.
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమా షూటింగ్ మార్చి నెలలో మొదలు కానుంది. శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసినట్టు మొదట వార్తలు వచ్చాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తుంది. నిర్మాతల నుండి అధికారిక ప్రకటన రాలేదు.

