చరణ్, శంకర్ సినిమా.. ఆగిపోదు కదా ?

Published on Apr 1, 2021 6:30 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. చరణ్ శంకర్ కాంబినేషన్ తొలిసారి కావడంతో అందరిలోనూ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఉండబోతోంది ఈ ప్రాజెక్ట్. అయితే ఈ సినిమాకు ఊహించని రీతిలో చిక్కులు ఎదురయ్యాయి.

శంకర్ లాక్ డౌన్ ముందు ‘ఇండియన్ -2’ స్టార్ట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ‘2.0’ ఫ్లాప్ కావడంతో ప్రాజెక్ట్ బడ్జెట్ తగ్గించేశారు నిర్మాతలు. శంకర్ రెమ్యునరేషన్లో కూడ కోత పెట్టారు. దాంతో శంకర్ నొచ్చుకున్నారు. ఆ సమస్యకు తోడు ఇంకొన్ని ఇబ్బందులు రావడంతో శంకర్ ఆ సినిమాను పక్కనపెట్టేసి చరణ్ సినిమాకు కమిటయ్యారు. అయితే ఇప్పుడు లైకా నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.

ఇప్పటికే ‘ఇండియన్-2’ మీద 180 కోట్లు ఖర్చు చేశామని, శంకర్ కు ఇస్తామన్న 40 కోట్లలో ఇప్పటికే 14 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చామని మిగతాది కోర్టులో డిపాజిట్ చేస్తామని, శంకర్ ను తమ సినిమా పూర్తి చేయకుండా వేరే సినిమాకు వెళ్లకుండా ఆపాలని పిటిషన్ వేసింది. అయితే కోర్టు శంకర్ వాదన విన్నాకే తీర్పు ఇస్తామంటూ వాదన వినిపించాలని శంకర్ కు నోటీసులు పంపింది. శంకర్ వాదనలతో న్యాయస్థానం సంతృప్తి చెందితే సరే ఒకవేళ చెందకపోతే మాత్రం శంకర్ ‘ఇండియన్-2’ను పూర్తిచేసే బయటకు రావాల్సి ఉంటుంది. అప్పుడు చరణ్ సినిమాకు తాత్కాలికంగా బ్రేకులు తప్పవు.

సంబంధిత సమాచారం :