‘గోవిందుడు అందరివాడేలే’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. ప్రస్తుతం వరుసగా స్క్రిప్ట్స్ వింటున్న రామ్ చరణ్ ఇటీవలే శ్రీను వైట్లతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇప్పటికే రామ్ చరణ్ ఓ సారి గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉందని తెలిపాము. మాకు అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా 2015లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం.
ప్రస్తుతం అజిత్, త్రిష, అనుష్క నటినటులుగా నటిస్తున్న ‘ఎన్నై అరిందాల్’ తమిళ సినిమా షూటింగ్ లో గౌతమ్ మీనన్ బిజీగా ఉన్నారు. పోలీస్ కథలను వెండి తెరపై ఆవిష్కరించడంలో గౌతమ్ మీనన్ శైలి సెపరేట్. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా చూపిస్తాడో చూడాలి..


