టఫ్ స్టంట్స్ ట్రైనింగ్ లో రామ్ చరణ్

టఫ్ స్టంట్స్ ట్రైనింగ్ లో రామ్ చరణ్

Published on Apr 15, 2015 11:17 AM IST

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ కి కామెడీని జోడించి చెప్పే డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రానున్న సినిమా ఇటీవలే మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా ఈ చిత్ర టీం సెకండ్స్ షెడ్యూల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఏప్రిల్ 22 నుండి మొదలు కానుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ స్టంట్ మాన్ పాత్ర కోసం రామ్ చరణ్ బాగా కష్టతరమైన స్టంట్స్ మీద ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నాడు. అక్కడ ఫేమస్ ది మార్షల్ ఆర్ట్స్ స్కూల్ లో జైక స్టంట్స్ పైన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ స్టంట్స్ చాలా కష్టం, అయినప్పటికీ రామ్ చరణ్ ఎంతో కష్టపడి నేర్చుకుంటున్నారు. త్వరలోనే రామ్ చరణ్ వచ్చి షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు