
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మెగాస్టార్ చిరంజీవి అతిధి పాత్రలో నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధించుకొని మొదటి వారంలోనే 35 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. చరణ్ బ్రూస్ లీ సినిమా అకోసం ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేసాడు. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత పలు ప్రమోషనల్ ఈవెంట్స్ లో బిజీ అయ్యాడు. ఇప్పుడు అన్నిటి నుంచీ ఫ్రీ అవ్వడంతో చరణ్ హాలిడేకి వెళ్ళాడు.
రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి గత రాత్రి అమెరికాకి వెళ్ళాడు. అక్కడ ఆయన కొద్ది రోజులు అన్ని విషయాలను, టెన్షన్స్ ని పక్కన పెట్టి కొద్ది రోజులు హాయిగా గడపనున్నాడు. రెండు వారాల తర్వాత రామ్ చరణ్ తిరిగి ఇండియాకి రానున్నాడు. వచ్చాక ముందుగా చిరు 150వ సినిమా స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసాడు. అలాగే ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తన తదుపరి చిఎనమని స్టార్ట్ చేస్తాడు. చరణ్ తమిళంలో విజయం సాధించిన ‘తని ఓరువన్’ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి కథలో మార్పు చేస్తున్నాడు.

