అక్కడ ‘వినయ విధేయ రామ’కు భారీ క్రేజ్ !

VVR6

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ చిత్రీకరణను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ మూడో వారంలో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.

కాగా ఈ చిత్రం జనవరి 11వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి కేరళలో కూడా బాగా క్రేజ్ క్రియేట్ అయిందని.. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం తెగ పోటీ పడ్డారట. చివరకి కేరళకు చెందిన వివిఆర్, ప్రకాష్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా మలయాళం హక్కులను చేజిక్కించుకున్నాయి. కేరళలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఈ రెండు సంస్థలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version