
‘బ్రూస్ లీ’ సినిమా రిలీజ్ తర్వాత కొన్నాళ్ళ పాటు విశ్రాంతి కోసమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాకు హాలీడేపై వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ హాలీడేను రామ్ చరణ్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని గడుపుతున్నారు. ఈ మధ్యే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దీపక్ చోప్రాను కలిసి ఆధ్యాత్మిక అంశాల పట్ల తనకున్న ఇష్టాన్ని గురించి, కొన్ని ఇతర విషయాల గురించి పంచుకున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియా వండర్ అయిన ఫేస్బుక్ కార్యాలయాన్ని చరణ్ సందర్శించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేస్బుక్ కార్యాలయంలో అక్కడి స్టాఫ్‌ను కలిసి సరదాగా అందరితో ముచ్చటించారు. ఇక ఇదే విషయాన్ని తన ఫేస్బుక్ ఎకౌంట్ ద్వారా పంచుకుంటూ, ఫేస్బుక్ ఆఫీస్‌లో ఇక్కడి స్టాఫ్‌తో సరదాగా కాసేపు మాట్లాడానని, ఇక్కడి ఫ్రెండ్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని తెలుపుతూ వాళ్ళందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలిపారు. ఇక ఈ సందర్భంగానే తీయించుకున్న కొన్ని ఫోటోలను చరణ్ అభిమానులతో పంచుకున్నారు. ఇక హాలీడే నుంచి తిరిగొచ్చిన తర్వాత చరణ్, తని ఒరువన్ సినిమా రీమేక్‌లో నటించేందుకు సిద్ధం కానున్నారు.