
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొంతకాలం క్రితం ఏవియేషన్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. టర్బో మెగా పేరుతో చెర్రీ ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీని నెలకొల్పారు. మార్చిలోనే ఈ ఎయిర్‌లైన్ సంస్థకు సంబంధించిన పనులు మొదలుకావాల్సి ఉన్నా కొన్ని పెండింగ్ పనుల వల్ల అది వాయిదా పడింది. ఇక తాజాగా ఇందుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయట. ఇప్పటికే డీజీసీఏ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. ఎయిర్‌లైన్ సంస్థకు అవసరమైన సిబ్బందిని కూడా ఇప్పటికే రిక్రూట్ చేసుకున్నారు. త్వరలోనే ఏటీఆర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనేందుకు సిద్ధమైపోయారు.
దాదాపుగా అన్ని కార్యక్రమాలూ పూర్తి కావస్తుండడంతో జూన్ నెలలో ఎయిర్‌క్రాఫ్ట్‌లు తమ ఆపరేషన్‌ను మొదలుపెట్టనున్నట్లు టర్బో మెగా కంపనీ అఫీషియల్‌గా తెలియజేసింది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయల్‌పై టాక్స్‌ను తగ్గించమని టర్బో మెగా కోరింది. ఫస్ట్ ఫేస్‌లో హైద్రాబాద్, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఈ సర్వీసులు నడపనున్నారు.

