మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తనకంటూ ఒక ఇమేజ్ ని, తనకంటూ ఒక మార్కుని సంపాదించుకుని ఇండస్ట్రీలో ఆగ్రహీరోల స్థాయికి అతితక్కువ సినిమాల సంఖ్యతో చేరుకున్నాడు. చిరంజీవి కొడుకుగా కాకుండా రామ్ చరణ్ అనే నటుడిగా ఈ యువహీరో ఎదిగిన తీరు అభినందనీయం
తన మొదటి సినిమా ‘చిరుత’ నుండి ఇటీవలే విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంవరకూ మొత్తం ఎనిమిది సినిమాలలో నటించిన చెర్రీ ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ 8 చిత్రాలలో 5 చిత్రాలు చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 40కోట్ల షేర్ సాధించగలిగాయి. ఈ లిస్టులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర, మాస్ ఎంటర్టైనర్స్ రచ్చ, నాయక్, ఎవడు సినిమాలేకాక ఇటీవలే విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే సినిమా కూడా వుండడంతో చరణ్ అభిమానులు చాలా ఆనందంగా వున్నారు. రామ్ చరణ్ ఇలానే మరిన్ని బ్లాక్ బస్టర్లు కొట్టాలని ఆసిస్తూ 123తెలుగు.కామ్ .


