సానియా పై చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ !

Published on Mar 6, 2023 3:30 pm IST

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకి మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్, ఆయన భార్య ఉపాసన మంచి స్నేహితులు. అందుకే, టెన్నిస్‌ కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా పై తాజాగా రామ్‌ చరణ్ ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం చరణ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ చరణ్ తన పోస్ట్ లో ఏం రాసుకొచ్చాడు అంటే.. చరణ్ మాటల్లోనే.. ‘నా ప్రియమైన స్నేహితురాలు సానియా మీర్జా.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ కోర్టులు నీ ఆటను మిస్ అవుతాయి. దేశ క్రీడారంగానికి నువ్వు చేసిన సేవ చాలా గొప్పది. నువ్వు ఎప్పుడూ మమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను’ అని చరణ్ ట్వీట్ చేశారు. పైగా ఈ ట్వీట్ తో పాటు సానియా, తన భార్య ఉపాసనతో కలిసి దిగిన ఫొటోను కూడా రామ్ చరణ్ షేర్ చేశాడు. ఫోటోలో దంపతులిద్దరూ చెరో పక్కన ఉండగా.. మధ్యలో సానియా ఉంది. ఈ ఫోటో చాలా క్యూట్ గా ఉంది.

సంబంధిత సమాచారం :