మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తన సినిమా షూటింగ్ తో పాటు తన ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ ని గోదావరి పుష్కరాలకు లాంచ్ చేసే పనిలో ఉన్నాడని ఇది వరకే తెలియజేశాం. మాకు అందిన సమాచారం ప్రకారం రామ చరణ్ – తన ఫ్రెండ్ ఉమేష్ కలిసి స్టార్ట్ చేసిన టర్బో మెగా ఐర్ల్ వేస్ నుంచి ఫస్ట్ ట్రూ జెట్ విమానం ఈ రోజు నింగికి ఎగరనుంది.
రామ్ చరణ్ టర్బో మెగాకి చెఇన్ద మొట్ట మొదటి ట్రూజెట్ ఫ్లైట్ ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి వెళ్లనుంది. ఈ రొజూదయమ్ జరిగిన ఈ ఎయిర్ వేస్ లాంచ్ కి డైరెక్టోరేట్ జెనెరల్ అఫ్ సివిల్ అవిఏషణ్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు, తెలంగాణ ఐటి మినిస్టర్ కెటిఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. నిన్ననే రామ్ చరణ్ రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ గా పూజలు కూడా చేసారు. గోదావరి పుష్కరాల కానుకగా ఈ ఎయిర్ వేస్ ని రాజమండ్రికి కూడా స్పెషల్ ట్రిప్స్ వేయనున్నారు. మొదటి సెషన్ లో హైదరాబాద్ ని బేస్ చేసుకొని ఈ ఎయిర్ లైన్ సర్వీస్ ని విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగుళూరు, ఔరంగాబాద్ లకి ట్రావెలింగ్ ప్లాన్ చేసారు.


