ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్

Published on Apr 18, 2012 4:48 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ చిత్ర షూటింగ్ ఈ నెల 27 నుండి ప్రారంభం కానుంది. ‘బృందావనం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన వంశి పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ 27 నుండి జరుగుతుండగా చరణ్ 30వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటాడు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన సమంతా హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించబోతున్నాడు. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :