
‘పండగ చేస్కో’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ దక్కడంతో హ్యాపీగా ఉన్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్, వెంటనే తరువాతి సినిమా షూటింగ్‌కు షిఫ్ట్ అయ్యాడు. ‘పండగ చేస్కో’ ప్రమోషన్ల కోసం రామ్, ‘శివం’ సినిమాకు కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే! తాజాగా మళ్ళీ ఆ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ‘శివం’ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.
కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫైటింగ్ సీన్లను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.ఈ మధ్యే ఎండలను సైతం లెక్కచేయకుండా కర్నూలులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్ ప్రస్తుతం హైద్రాబాద్‌కు షిఫ్టైంది. మరికొన్ని రోజులు హైద్రాబాద్‌లోనే ఈ మాస్ ఎంటర్‌టైనర్ షూటింగ్ జరగనుంది. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

