ఎనర్జిటిక్ స్టార్ తో అనిల్ రావిపూడి ?

Published on Jan 18, 2021 9:00 am IST

డైరెక్టర్ అనిల్ రావిపూడి డీసెంట్ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తాడు. కాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమా చేయమని, రావిపూడితో సంప్రదింపులు జరిపినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అనిల్ రైటర్ గా ఉన్నప్పటి నుండి రామ్ తో మంచి అనుబంధం ఉంది. వచ్చే ఏడాది చివర్లో రామ్ – అనిల్ రావిపూడి కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉందని తాజాగా సినీవర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక ఈ చిత్రం కూడా అనిల్ సినిమాల శైలిలోనే ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండనుందట.

మొత్తానికి కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్ మీద ఎక్కువగా దృష్టిపెట్టే డైరెక్టర్ అనిల్ కావడంతో ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న హీరోల దగ్గర్నుండి స్టార్ హీరోల వరకు అందరూ ఆయనతో వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నారు. కాగా ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. ఏది ఏమైనా తెర పైన కామెడీను తీసుకురావడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్.

సంబంధిత సమాచారం :