అ సినిమాలకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఆర్జీవీ?

Published on Jul 17, 2021 1:09 am IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ‌ ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో, ఏ కథను సెట్స్‌పైకి తీసుకెళ్తాడో చెప్పడం చాలా కష్టం. అయితే గతంలో ఏరోటిక్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఐస్‌క్రీమ్ సినిమాను, ఆ తర్వాత ఐస్‌క్రీమ్-2ను వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మొద‌టి పార్టులో న‌వ‌దీప్‌, తేజ‌స్వి లీడ్ రోల్‌లో న‌టించగా, సెకండ్ పార్టులో మృదులా భాస్క‌ర్ లీడ్ రోల్‌లో న‌టించింది.

అయితే తాజాగా ఈ సిరీస్‌లో మూడో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. తొలి రెండు పార్టులను నిర్మించిన తుమ్మ‌ల‌ప‌ల్లి రామస‌త్య‌నారాయ‌ణ మూడో పార్టును కూడా ప్రొడ్యూస్ చేయ‌బోతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే స్పష్టత రానున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :