మీడియాకు సారీ చెప్పిన వర్మ

మీడియాకు సారీ చెప్పిన వర్మ

Published on Jul 16, 2014 3:00 PM IST

ram-gopal-varma
‘ఐస్ క్రీం’ సినిమా విడుదల అనంతరం కొందరు వ్యక్తులు తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల పట్ల వర్మ ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మీడియాను ఉదాహరిస్తూ వర్మ వాడిన పదజాలం అసలు బాగోలేదు. ఈ లేకపై మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి ముగింపు పలికారు వర్మ. తను ఆ లేఖలో విమర్శించింది కేవలం ఒక వ్యక్తిను మాత్రమె అని, దానివల్ల మీడియాలో ఇతరులు బాధపడితే సభాముఖంగా క్షమాపణ కోరుతున్నాను అని వర్మ తెలిపారు.

‘ఐస్ క్రీం’ చిత్రం విజయం సాదించడంతో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ‘ఐస్ క్రీం-2’ చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రీకరణ ప్రారంభించి సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు