తన చావు పై వర్మ షాకింగ్ కామెంట్స్ !

Published on Jun 29, 2021 12:14 am IST

కరోనా వచ్చినా.. ప్రపంచం మొత్తం కష్ట కాలంలో నలిగిపోతోన్నా.. రామ్ గోపాల్ వర్మ మాత్రం తన వివాదాస్పద కామెంట్స్ ను అలాగే కంటిన్యూ చేస్తూ పోతున్నాడు. తాజాగా తన చావు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తన చావు పై వర్మ మాట్లాడుతూ.. ‘పుట్టాక చనిపోవడం అనేది చాలా కామన్‌. కాబట్టి, చావు ఎప్పుడైనా వస్తుంది, దాని గురించి భయపడుతూ బాధ పడటం వేస్ట్. కాబట్టి ఏదైనా అనుబాంబు పేలుతున్న సమయంలో నేను దాన్ని చూస్తూ చనిపోవాలి’ అంటూ బాంబు పేల్చాడు ఆర్జీవీ.

ఇంతకీ ఇలాంటి కోరిక ఎందుకు కోరుకున్నాడు అంటే.. అణుబాంబు ఎలా పేలుతుంది అనే విషయాన్ని నేను చూడాలనుకుంటున్నాను’ అంటూ ఆర్జీవీ తెలియజేశాడు. అసలు ఆర్జీవీకి ఎవరు ఏమనుకుంటారో అనే భయమే కాదు, అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేదు. ఆర్జీవీ అంటేనే వైవిధ్యం. ఆర్జీవీ ఆలోచనా విధానమే వెరైటీ.

సంబంధిత సమాచారం :