కొత్త అవతారంలో రామ్ గోపాల్ వర్మ ?

Published on Apr 7, 2019 3:12 pm IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. ఆయనగారు కొత్తగా నటుడిగా మారబోతున్నారు. ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్బంగా ఆర్జీవీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆర్జీవీ నటించబోయే సినిమా పేరు ‘కోబ్రా’ అంటా. ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఆర్జీవీనే వహించనున్నాడు.

మొత్తానికి వర్మ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా రానిస్తాడేమో చూడాలి. అయితే వర్మ ‘కోబ్రా’లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తాడా ? లేక, గెస్ట్ రోల్ చేస్తాడా ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని కూడా వర్మ తన ఓన్ బ్యానర్ గన్ షాట్ ఫిలిమ్స్ బ్యానర్ పైనే నిర్మించనున్నాడు.

ఇక మరోపక్క రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారికి శశికళకి మధ్య ఉన్న రిలేషన్ ను బేస్ చేసుకుని ఓ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :