ఈ వీడియోలో ఉన్నది కాదు ఒట్టు – వర్మ

Published on Aug 23, 2021 6:30 pm IST

ఆర్జీవీ ఈ మధ్య చేష్టలతో మితిమీరిపోతున్నాడు. వర్మ చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎదురుగా అమ్మాయి కనిపిస్తే.. ఆయన ప్రవర్తన మారిపోతుంది. తాజాగా మరో అమ్మాయితో బర్త్‌డే పార్టీలో హంగామా చేసి సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ అయ్యాడు దీని పై విమర్శలు వస్తోన్న నేపథ్యంగా వర్మ అలాంటి మరొక వీడియోను ట్వీటర్‌ లో షేర్‌ చేస్తూ సంచలన కామెంట్స్‌ చేశాడు.

‘మీ అందరికి ఓ విషయంపై క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌ డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ మీద ఒట్టు’ అంటూ తనదైన స్టైల్‌లో ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. ఇక వర్మ తన పైత్యాన్ని ఇలా చూపించడం ఏ మాత్రం సమంజసం కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వర్మ మాత్రం రోజురోజుకు విపరీత ధోరణితో ముందుకు పోతున్నాడు.

సంబంధిత సమాచారం :