విరాళాలు ఇచ్చిన హీరోలపై వర్మ సెటైర్లు..

RGV
హుధూద్ తుఫాన్ భాదితుల సహాయార్ధం తెలుగు హీరోలు డబ్బు సహాయం చేయడంతో పాటు ఎంతో విలువైన మనోధైర్యం, మీకు అండగా మీమున్నాం అనే భోరోసా కల్పించారు. వీరు స్పందించిన తీరు పట్ల సామాన్య ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వ్యక్తి తప్ప. ఆయనే ప్రముఖ సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ. తెలుగు హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘కొన్ని వందల కోట్ల రూపాయలను ప్రజల వద్ద నుండి తీసుకుని, కేవలం లక్షల రూపాయలను విరాళంగా ఇస్తారా. వీరి తీరు చూసిన నేను షాక్ కు గురయ్యాను. ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి తుఫాన్ బాధితులపై ప్రేమను కురిపిస్తూ.. వారి కోసం ప్రార్ధనలు చేస్తున్నారు’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

25 ఏళ్ళ వర్మ కెరీర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలను నిర్మించారు. వాటిని సూపర్ హిట్స్ చేశారు ప్రేక్షకులు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మానుకుని, వర్మ ఎంత సహాయం చేశారో చెప్తే బాగుంటుంది. ఇతరులను వేలెత్తి చూపితే, నాలుగు వెళ్ళు మనవైపు చూస్తాయి అనే సత్యం తెలుసుకుంటే మంచిదని పలువురు హితబోధ చేస్తున్నారు.

Exit mobile version