
జీనియస్ ఫేం హవీష్ హీరోగా దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా రామధూత క్రియేషన్స్ పతాకంపై నిర్మించబడిన సినిమా.. రామ్‌లీల. శ్రీపురణం కిరణ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను సోమవారం ఉదయం నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా జీనియస్‌ను ఆదరించినట్టుగానే, రెండవ చిత్రమైన రామ్‌లీల సినిమానూ ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా, హవీష్‌కు రామ్‌లీల గుర్తిండిపోయే సినిమా అవుతుందని ఆయన అన్నారు. హీరో హవీష్ మాట్లాడుతూ.. సినిమా కథ వినగానే రామ్ పాత్ర తనను ఎగ్జైట్ చేసిందని, చాలెంజ్‌గా తీసుకొని ఆ పాత్రను పోషించానని అన్నారు.
దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమాకే హిట్ టాక్ రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌లో సగం ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీకే దక్కుతుందని అన్నారు. ఇదే సక్సెస్ మీట్‌లో హీరోయిన్ నందితతో పాటు మాటల రచయిత విస్సు, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి, తదితరులు మాట్లాడుతూ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

