ఒక కొత్త ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు అంటే అతను ఒక స్టార్ హీరో లేదా ఆల్రెడీ కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్న హీరోని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకున్న పి. రామ్ మోహన్ మాత్రం తన ప్రతి సినిమా ద్వారా యంగ్ టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు అందులో చాలా మంది ఇప్పుడు స్టార్స్ గా టాలీవుడ్ లో వెలుగొందుతున్నారు.
రామ్ మోహన్ నిర్మాతగా చేసిన మొదటి సినిమా ‘అష్టా చమ్మా’. ఈ సినిమా ద్వారా యంగ్ హీరో నానిని హీరోగా పరిచయం చేసాడు. ప్రస్తుతం నాని యంగ్ జెనరేషన్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అలాగే అదే సినిమా ద్వారా పరిచయం చేసిన అవసరాల శ్రీనివాస్ నటుడిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే, డైరెక్టర్ గా కూడా మారి సక్సెస్ అందుకున్నాడు. ప్రసతుతం మరో సినిమాని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. అలాగే అష్టా చమ్మా ద్వారా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న స్వాతికి హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన గోల్కొండ హైస్కూల్ సినిమా ద్వారా పలువురు జూనియర్ యాక్టర్స్ ని పరిచయం చేసాడు. అలాగే 2013లో వచ్చిన ఉయ్యాలా జంపాలా సినిమా ద్వారా రాజ్ తరుణ్ ని హీరోగా చేసాడు. డైరెక్షన్ టీంలోకి వచ్చిన రాజ్ తరుణ్ టాలెంట్ చూసిన అతన్ని హీరోగా పెట్టి ఉయ్యాలా జంపాలా సినిమా చేసాడు. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నాడు. అదే సినిమా ద్వారా అవిక గోర్ ని హీరోయిన్ గా పరిచయం చేసాడు. తను కూడా ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తోంది.
ఇటీవలే తను డైరెక్టర్ గా మారి చేస్తున్న ‘తను నేను’ సినిమాతో కూడా డైరెక్టర్ శోభన్ వాళ్ళ అబ్బాయి సంతోష్ శోభన్ ని హీరోగా పరిచయం చేసాడు. ఇలా తన ప్రతి సినిమాతో యంగ్ టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్న రామ్ మోహన్ పై అందరూ ప్రశంశలు గుర్తిస్తున్నారు. తను పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీబిజీ స్టార్స్ గా ఉన్నారు. త్వరలో తన బ్యానర్ నుంచి రానున్న పిట్ట గోడ సినిమా ద్వారా కూడా కొత్తవారిని పరిచయం చేయనున్నాడు. దాంతో ప్రస్తుతం టాలీవుడ్ కి కొత్త టాలెంట్ ని అందిస్తున్న వారిలో ప్రధమంగా రామ్ మోహన్ పేరు ప్రధమంగా చెప్పుకోవాలి.
