ప్రారంభమైన రామ్ కొత్త సినిమా !
Published on Apr 26, 2018 12:42 pm IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజే లాంఛనంగా ప్రారంభమైంది. అడ్వెంచరస్ డ్రామాగా ఉండనున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ మే నెల నుండి మొదలుకానుంది.

ఈ చిత్రం గురించి ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ యాక్షన్, అడ్వెంచరస్ అంశాలతో సాగే ఈ కథ చాల గ్రిప్పింగా ఉంటుంది. రామ్ కు అన్ని విధాలా సరిపోయే కథ. సినిమా అందరినీ మెప్పించే విధంగా ఉంటుంది అన్నారు. పి. కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించనున్నారు. తమిళ పరిశ్రమకు చెందిన ఒక పాపులర్ నటుడు, బాలీవుడ్ కు చెందిన దర్శన్ కుమార్, మలయాళ నటుడు సంజు శివరామ్ లు పలు కీలక పాత్రలు పోషించనున్న ఈ సినిమాను ఎక్కువ భాగం యూరప్ లో చిత్రీకరించనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook