టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన సింగిల్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఒంటరిగా గడపడం చిన్నప్పటి నుంచే అలవాటని, ఆ ఏకాంతం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆయన స్పష్టం చేశాడు.
సినిమా షూటింగ్స్‌లో వందలాది మంది మధ్య ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నానని రామ్ తెలిపాడు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఏడాదిన్నర పాటు ఒంటరిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు.
భవిష్యత్తులో ఎవరైనా తన జీవితంలోకి వస్తే ఆహ్వానిస్తానని, ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగానే మరింత సంతోషంగా ఉంటానని రామ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
