లేటెస్ట్ : తన పెళ్లి పుకార్ల పై ఫైనల్ గా హీరో రామ్ క్లారిటీ

Published on Jun 29, 2022 6:02 pm IST

టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ గా చేస్తున్న సినిమా ది వారియర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తీస్తున్న ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. మరొక రెండు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక మ్యాటర్ లోకి వెళితే, రామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, తనతో కలిసి చదువుకున్న చిన్ననాటి స్కూల్ మేట్ నే ఆయన చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో పుకార్లు ప్రచారం అవుతుండడంతో ఫైనల్ గా వాటిపై నేడు కొద్దిసేపటి క్రితం స్పందించారు రామ్. దయచేసి ఇటువంటి పుకార్లు ప్రచారం చేయవద్దని, ఇప్పటికే ఇది శృతిమించి ఆఖరికి తన కుటుంబానికే తాను ఎవరినీ పెళ్లి చేసుకోబోవడం లేదు అంటూ గట్టిగా చెప్పాల్సిన పరిస్థితికి వచ్చేలా ఉందని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేస్తూ విజ్ఞప్తి చేసారు రామ్ పోతినేని.

సంబంధిత సమాచారం :