టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినషన్…బోయపాటి తో రామ్ పోతినేని!?

Published on Aug 30, 2021 2:01 pm IST


టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రామ్ పోతీనేని. ప్రస్తుతం ఈ హీరో లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో నదియా కీలక పాత్ర లో నటిస్తుంది.

రామ్ పోతినేని ఈ చిత్రం తర్వాత చేయబోయే చిత్రం ఇదే అంటూ సినీ పరిశ్రమ లో టాక్ వినబడుతుంది. బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించనున్నట్లు తెలుస్తుంది. రామ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిరియాల రవీందర్ రెడ్డి మరియు చిట్టూరి శ్రీను లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :