రామ్ ‘డిన్చక్’ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది

రామ్ ‘డిన్చక్’ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది

Published on May 20, 2020 10:15 PM IST

రామ్ లేటెస్ట్ మూవీ రెడ్. ఈ చిత్రంలోని ఐటెం నంబర్ డిన్చక్… సాంగ్ టీజర్ వీడియో రామ్ బర్త్ డే కానుకగా విడుదల చేయగా యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. విడుదల చేసిన రెండు గంటల వ్యవధిలో వన్ మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్ 5 గంటల్లో 2 మిలియన్, 10 గంటల్లో 3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటికే 1.90 లక్షల లైక్స్ సాధించిన ఈ సాంగ్ 6 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది.

మణిశర్మ మాస్ బీట్ కి రామ్ మరియు హీరోయిన్ హెబ్బా పటేల్ ఎనర్జిటిక్ స్టెప్స్ తో దుమ్ము రేపారు. రెడ్ మూవీ తమిళ హిట్ చిత్రం తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ అందుకున్న రామ్ మొదటిసారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తుండగా స్రవంతి రవి కిషోర్ తెరకెక్కిస్తున్నారు. మాళవిక శర్మ, అమృత అయ్యర్ మరియు నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు