టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో రామానాయుడు జయంతి వేడుకలు.

టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో రామానాయుడు జయంతి వేడుకలు.

Published on Jun 6, 2020 1:11 PM IST

మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85 వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ‌ఈ కార్యక్రమంలో సురేష్ బాబు , సి.కల్యాణ్ , కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ… 85 వ జయంతి సందర్భంగా రామఉన్నారు‌గారికి నివాళులు అర్పించాము. రామానాయుడు గారు లేకుంటే హైదరాబాదు లో సినిమా పరిశ్రమ, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు.. ఫిలిం నగర్ లో విగ్రహం తో పాటు ,రామానాయుడు గారి పేరుతో ఎది మొదలు పెట్టినా సక్సెస్. ఫిలింనగర్ కు చెన్నరెడ్డి, దాసరి, రామానాయుడు గారు దేవుళ్ళు లాంటి వారున్నారు.

నిర్మాత సి‌.కల్యాణ్ మాట్లాడుతూ .. రామానాయుడు గారంటే మాకు ఓ హీరో, రోల్ మోడల్. నాకు దాసరి గారు ,రామానాయుడు గారు ఎంతో ప్రొత్సహించిన వ్యక్తులు. నిర్మాతలగానే కాకుండా , సినీ పరిశ్రమ, దానికి అనుంబంద ఆఫీస్ లన్నీ డెవలెప్ కావటానికి రామానాయుడు గారే కారణం. నాయుడు గారిని తలుచుకుని మేము సినిమా స్టార్ట్ చేస్తాము. ఆయన జయంతి ని ఎప్పుడు గొప్పగా జరుపుకుంటామన్నారు. రామానాయుడు గారి వారసుడిగా అభిరామ్ ఆయన ప్లేస్ ను ఫిల్ చెస్తాడన్నారు.

అనంతరం రామానాయుడు గారి మనవడు అభిరామ్ మాట్లాడుతూ.. తాత గారు ఫిజికల్ లేకున్నా ,మెంటల్ గా నాకు సపోర్ట్ గానే ఉంటారన్నారు.
ఆ తర్వాత ప్రముఖ నిర్మాత కె.ఎస్‌రామారావు మాట్లాడుతూ .. నిర్మాతగా నాకు రామానాయుడు గారే స్పూర్తి.‌ వారి ఫాలోవర్ గా సినిమాలు చెశాను. మా బ్యానర్ లో మంచి సినిమాలు రావటానికి నాయుడు గారి ప్రొత్సాహం ఎంతో ఉందన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు