ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘రమణి కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘రమణి కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

Published on Jun 9, 2026 9:02 PM IST

సూర్య వశిష్ట, దీప్షికా చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘రమణి కల్యాణం’ ఇటీవల మే 22న థియేటర్లలో రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను విజయ్ ఆది రెడ్డి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంది.

‘రమణి కళ్యాణం’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ జూన్ 12, 2026 నుండి స్ట్రీమింగ్ చేయనుంది. ఇక మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‌లో కూడా ఈ చిత్రం అదే రోజున అందుబాటులోకి రానుంది.

థియేటర్లలో లిమిటెడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. శ్రీనివాస రెడ్డి, శ్యామల కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు