‘సల్మాన్‌ ఖాన్‌’ దగ్గరికెళ్ళిన ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్ !

Published on Jul 11, 2018 9:33 am IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ తన ఫ్యామిలీతో కలిసి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను కలుసుకున్నారు. దబాంగ్‌ టూర్ లో భాగంగా సల్మాన్‌ ఖాన్‌ యూఎస్‌ లో ఉన్నారు. ఈ సందర్భంగా రంభ తన భర్త, పిల్లలతో కలిసి వచ్చారు. కాగా గతంలో ‘జుడ్వా’ అనే చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌, రంభ కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. అప్పటి సంగతులను గుర్తుచేసుకుంటూ రంభ, సల్మాన్‌ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కలిసి ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలు రంభ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేశారు.

కాగా రంభ, ఆ ఒక్కటీ అడక్కు చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య పలు టెలివిజన్‌ షోలలో కూడా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

సంబంధిత సమాచారం :