రామ్ చరణ్, బోయపాటి సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 14, 2018 10:34 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ చాలా సంవత్సరాల తర్వాత ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. కాగా రేపటినుండి ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ మొదలవ్వనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రకరణ జరుపుతామని చిత్రబృందం అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా పేర్కొంది.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More