వివిఆర్ డిస్ట్రిబ్యూటర్లకు అండగా చరణ్ , దానయ్య

Published on Feb 10, 2019 9:46 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఇటీవల విడులదై నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు 30శాతం లాస్ వచ్చిందట. దాంతో వారిని ఆదుకోవడానికి రామ్ చరణ్ అలాగే చిత్ర నిర్మాత దానయ్య డివివి 5 కోట్ల వరకు రిటర్న్ ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఇటీవల సినిమా విజయం సాధించలేకపోయిందని ఒక లేఖ ద్వారా అధికారకంగా ప్రకటించి ఫ్యాన్స్ గర్వపడేలాచేశాడు చరణ్.

అయితే డిజాస్టర్ టాక్ ను తట్టుకొని దాదాపు 60 కోట్ల ను రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ లోఏం మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దాంతో ఇప్పటికే అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు కూడా దానయ్య కొంత మొత్తాన్ని చెల్లించాడని సమాచారం. ఏది ఏమైనా సినిమా ఫెయిల్ అయ్యినప్పుడు నిర్మాత , హీరో డిస్ట్రిబ్యూటర్లకు అండగా నిలవడం గొప్ప విషయమే.

సంబంధిత సమాచారం :