సల్మాన్ కోసం చరణ్ మరోసారి .. !

Published on Apr 20, 2019 12:16 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ , మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ల స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. చరణ్‌ బాలీవుడ్‌లో ‘జంజీర్‌’ రీమేక్‌ చేసినప్పుడు సల్మాన్‌ హెల్ప్ చేశాడు. దానికి బదులుగా సల్మాన్ ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రం తెలుగులో డబ్ అవుతున్నప్పుడు సల్మాన్‌ పాత్రకు చరణ్‌ డబ్బింగ్‌ చెప్పాడు.

ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ కాబోతుంది. సల్మాన్‌ఖాన్‌ నటించిన తాజా చిత్రం ‘భారత్‌’ హిందీతో పాటు తెలుగులోనూ విడుదలకానుంది. ఈ చిత్రంలో సల్మాన్‌ పాత్ర కు మరోసారి చరణ్‌ తన గాత్రాన్ని అందించనున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ డిఫ్రెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. జూన్ 5న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :