గోవిందుడితో అమెరికాని ఏలనున్న రామ్ చరణ్..

గోవిందుడితో అమెరికాని ఏలనున్న రామ్ చరణ్..

Published on Sep 27, 2014 6:31 PM IST

Ram-Charan
రామ్ చరణ్ తేజ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ ఈ నెల అక్టోబర్ 1న విడుదలకానుంది. ఈ చిత్రం సెన్సార్ పనులని ముగించుకుని యు/ఏ సర్టిఫికేట్ ని సంపాదించుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు లెవల్లో థియేటర్లలో విడుదలకానుంది
నైజాం, సీడెడ్ మరియు రెండు రాష్ట్రాల ఇతర ప్రాంతాలలో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. కెరీర్ లో అమెరికాలో భారీ హిట్ లేని చెర్రీకి ఈ సినిమాతో ఆ లోటు తీరిపోనుందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 30న 100 ప్రత్యేక షోలను అమెరికాలో ప్రదర్శించనున్నారు. ఈ చిత్ర విజయంపై నిర్మాత బండ్ల గణేష్ ధీమా వ్యక్తంచేశారు

తాజా వార్తలు