మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ గా ఉన్న టర్బోమేఘ కంపెనీకి కేంద్ర విమానయాన శాఖ రీజనల్ సర్వీసులు నడపడానికి అనుమతి మంజూరు చేసిన మరుక్షణం నుండి మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. రామ్ చరణ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. మెగా కాంపౌండ్ నుండి ఈ విషయంపై ఎవరూ పెదవి విప్పలేదు.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ నిమిత్తం పొల్లాచ్చి వెళ్లారు. ఈ నెలాఖరు వరకు పొల్లాచ్చిలో షూటింగ్ జరుగుతుంది. తిరిగి హైదరాబాద్ వచ్చిన వెంటనే రామ్ చరణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారని సమాచారం. ఆ ప్రెస్ మీట్ లో టర్బోమేఘ లోగో కూడా ఆవిష్కరణతో పాటు ఫ్యూచర్ ప్లాన్స్ వెల్లడించే అవకాశం ఉంది.


