
అనవసరపు సరికొత్త ప్రయోగాల పేరుతొ వరుసపెట్టి ఫ్లాపులను జమ వేసుకుంటున్న రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు అభిమానులు హర్షించే నిర్ణయం తీసుకున్నారు. ఈ దర్శకుడు ఈసారి ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేయనున్నాడట. ఈ సినిమా తన గత చిత్రాల మాదిరి ప్రయోగాత్మకంగా వుండకుండా రెగ్యులర్ ఫార్మాట్ లో సాగనుందని సమాచారం
ఈ ప్రాజెక్ట్ లో జగపతిబాబు, మంచు విష్ణు లు కూడా ముఖ్య భూమికలు పోషించనున్నారు. రామూ తన ‘స్పాట్’ షూటింగ్ అనంతరం ఈ సినిమాను తెరకెక్కించే సూచనలు వున్నాయి