దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన దగ్గర్నుంచే ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సినిమాలోని గ్రాఫిక్స్, సెట్టింగ్‌లు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, రాజమౌళి విజన్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడనటువంటి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా థ్రిల్ చేయడంతో బాహుబలిని దేశవ్యాప్తంగా విజువల్ వండర్‌గా ప్రశంసిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అయిన రామోజీ రావు, రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తారు. రాజమౌళి విజన్, నటీనటుల పనితీరు, విజువల్స్ అన్నీ బాగున్నాయని, రాజమౌళి, అతడి టీమ్‌పై రామోజీ ప్రశంసలు కురిపించారు. దాదాపు 5000కు పైగా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు, భారీ సెట్టింగులతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అధిక భాగం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాకు అన్నిచోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.


