గత కొన్ని నెలలుగా కామెడీ ఎంటర్టైనర్ ‘పండగ చేస్కో’ షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న యువ హీరో రామ్ చిన్న విరామం తీసుకుని ఆస్ట్రేలియా లో హాలిడే ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలావుండగా తన తర్వాతి సినిమా కోసం కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తో చర్చలు జరుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘శివం’ అనే పేరు ఖరారు చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి లో మొదలు కానుంది.
ఇంకో ఆశక్తికరమైన విషయం ఎంటంటే ‘శివం’ చిత్రం మహేష్ బాబు-క్రిష్ చేస్తారని వార్తలు వచ్చాయి. ‘శివం’ కి సంభందించిన మరిన్ని విషయాలు వెలువడాల్సి వుంది. ఇదిలావుండగా రామ్ ‘పండగ చేస్కో’ పూర్తికావొస్తుంది. ఇటివలే ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.


