పసివాడి ప్రాణం కాపాడిన రామ్

పసివాడి ప్రాణం కాపాడిన రామ్

Published on Dec 28, 2014 6:08 PM IST

ram

మన స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి తమ వంతు సాయం చేస్తుంటారు. అలానే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా తన వంతుగా సాయం చేసి ఓ పసివాడి ప్రాణాన్ని రక్షించాడు. శ్రవణ్ కార్తీక్ 6 నెలల బిడ్డ, తనకి హార్ట్ డిసీస్ ఉండడం వల్ల తను ఆంధ్ర హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఆ పసివాడికి ఓ సర్జరీ చేస్తే బతుకుతాడు కానీ ఆ బాబు తల్లి తండ్రులకు అంట స్తోమత లేదు. దాంతో సమంత నిర్వహించే ప్రత్యూష ఆర్గనైజేషన్ వారు అందరినీ శ్రవణ్ ని కాపాడమని కోరారు.

అప్పుడే హీరో రామ్ ముందుకు వచ్చి తన వంతుగా ఆ పసివాడి ఆపరేషన్ కి సరిపడా మనీ ఇచ్చి సాయం చేసాడు. తన మంచితనం గురించి సమంత తన ట్విట్టర్ ద్వారా మెచ్చుకోవడమే కాకుండా, కృతఙ్ఞతలు చెప్పింది. ఆ విషయంలో రామ్ హ్యాపీ అవ్వడమే కాకుద్నా ప్రత్యూష లాంటి ఓ ఆర్గనైజేషన్ ని నడుపుతున్నందుకు ఆమెను మెచ్చుకున్నాడు. దీంతో మరోసారి సినీ స్టార్స్ పబ్లిక్ ని ఆడుకోవడంలో ఎప్పుడు ముందుంటారని తెలిపాడు. రామ్ ప్రస్తుతం ‘పండగ చేస్కో’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అది కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజా వార్తలు