రామ్ పెద్ద ప్లానే వేశాడు !

Published on Jan 21, 2021 5:32 pm IST

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఫామ్లోకి వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి స్పందన అనుకుంటోంది. మొదటిరోజు ఊహించిన దానికంటే ఎక్కువగానే వసూలు చేసింది. ఓపెనింగ్ డే మాత్రమే కాదు ఆ తర్వాత కూడ అదే జోరు కొనసాగించింది. ఏడు రోజులకుగాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వరకు వరకు వసూళ్లు సాధించింది.

ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ టార్గె 14.5 కోట్లు కాగా ఇప్పటి వరకు 3.5 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇంకొన్ని రోజుల వాటాకు పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి ఈ సినిమాకు మంచి రన్ లభించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాను మలయాళంలో కూడ విడుదలచేస్తున్న సంగతి తెలిసిందే. విడుదల అంటే ఏదో సాదాసీదా విడుదల కాదు. కొద్దిగా పెద్ద స్థాయిలోనే చేస్తున్నారు. సుమారు 104 థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది. రామ్ కెరీర్లో ఇదే అతి పెద్ద మలయాళ రిలీజ్. సినిమా అక్కడ కూడ విజయవంతం అయితే రామ్ కు మలయాళంలో కూడ మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More