యాక్షన్ ఎపిసోడ్ తో మొదలైన రామ్ ‘శివం’

యాక్షన్ ఎపిసోడ్ తో మొదలైన రామ్ ‘శివం’

Published on Feb 11, 2015 8:32 AM IST

ram
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం ‘పండగ చేస్కో’ సినిమా షూటింగ్ ని దాదాపు ఫినిష్ చేసాడు. ఈ సినిమా చివరి దశకు చేరుకునేలోపు రామ్ మరో రెండు సినిమాలకు సైన్ చేయడమే కాకుండా, అందులో మొదటగా శివం సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. సురేందర్ రెడ్డి అసిస్టెంట్ అయిన శ్రీనివాస్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేయనున్న సినిమా ఈ సోమవారం హైదారాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. మొదలు పెట్టిన మరుసరి రోజు నుంచే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు.

అది కూడా ఓ యాక్షన్ ఎపిసోడ్ తో రామ్ శివం సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. ప్రసతుతం హైదరబాద్ శివార్లలో పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రామ్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 25 వరకూ హైదరాబాద్ లోనే జరగనుంది. స్రవింతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ప్రసతుతం ఈ సినిమాలో రామ్ జోడీ కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు రాశి ఖన్నాని కూడా హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. రామ్ చేస్తున్న పండగ చేస్కో సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు