మెగా హీరో సినిమాలో ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ

Published on Mar 19, 2020 9:00 pm IST

మెగా హీరో సాయితేజ్ ఇటీవలే కొత్త చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దేవ కట్ట డైరెక్ట్ చేయనున్నారు. ఇదొక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రం. 2004లో జరిగిన యాధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉండనుంది. ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో పాపులర్ నటి రమ్యకృష్ణ నటించనున్నారని తెలుస్తోంది. ఈమె పాత్ర చిత్రంలో చాలా కీలకంగా ఉంటుందట.

ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఏప్రిల్ 20 నుండి మొదలుకానుండగా మొదటి షెడ్యూల్ 27 రోజుల పాటు ఏకధాటిగా జరగనుంది. ఏలూరు నేపథ్యంలో సాగే ఈ కథలో తేజ్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పొలిటికల్ డ్రామాలో కథానాయకిగా నివేత పేతురాజ్ నటించనుంది. జె.భగవాన్, పుల్లారావ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే తేజ్ కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ మే 1న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More